బ్రహ్మజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బాపు. ఆమని, బలగం సుధాకర్రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. దయా దర్శకుడు. రాజు, సీహెచ్ భానుప్రసాద్రెడ్డి నిర్మాతలు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన హీరోలు రానా దగ్గుబాటి, తిరువీర్ చిత్ర నిర్మాతలకు శుభాకాంక్షలు అందించారు. బాపు ఓ మంచి ప్రయత్నమని, మంచి కంటెంట్ ఉన్న సినిమా అని తప్పకుండా అందరికీ నచ్చుతుందని బ్రహ్మాజీ చెప్పారు. విభిన్నమైన కథ, కథనాలతో ఈ సినిమా రూపొందిందని దర్శకుడు దయ తెలిపారు. ఇంకా మధుర శ్రీధర్, సంగీత దర్శకుడు ధృవన్ కూడా మాట్లాడారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండెం, నిర్మాణం: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్.
