టైమ్ మ్యాగజైన్ అందించే విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అస్సాంకు చెందిన భారతీయ జీవ శాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకురాలు పూర్ణిమా దేవి బర్మన్ ఎంపికయ్యారు. మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న అసాధారణ నాయకులను గౌరవించేందుకు టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాది ఎంపిక చేసిన మిమెన్ ఆఫ్ ది ఇయర్-2025 జాబితాలో పూర్ణిమా దేవి బర్మన్ ఉన్నారు. 13 మంది మహిళలతో టైమ్ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించగా, అందులో పూర్ణిమాదేవి ఒక్కరే భారతీయ మహిళ కావడం విశేషం. అస్సాంలో గ్రేటర్ అడ్జంటర్ అనే జాతి కొంగల సంరక్షణకు పూర్ణి మ ఎంతో కృషి చేశారు.
