
రోషన్, కార్తికేయదేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం టుక్ టుక్. సుప్రీత్‌కృష్ణ దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సూపర్ నాచురల్ ఎలిమెంట్స్‌తో సాగే వినోదాత్మక చిత్రమని, ముగ్గురు యువకుల జీవిత ప్రయాణం నేపథ్యంలో సాగుతుందని, థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఫాంటసీ అంశాలతో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్‌లుంటాయని నిర్మాతలు పేర్కొన్నారు. విభిన్న కథా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చిత్ర తారాగణం తెలిపారు. ఈ నెల 21న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, నిర్మాతలు: రాహుల్ రెడ్డి, శ్రీవరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ కృష్ణ, దర్శకుడు: సుప్రీత్‌కృష్ణ.
