Namaste NRI

రాబిన్‌హుడ్‌ అదిదా సర్‌ప్రైజ్.. గ్లామర్ తో హీటెక్కించిన కేతికాశర్మ

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్‌. శ్రీలీల కథానాయిక.  వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అదిదా సర్‌ప్రైజ్‌ పేరుతో ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఇందులో కేతికశర్మ నర్తించింది. చంద్రబోస్‌ రాసిన ఈ గీతాన్ని అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరకర్త. హుషారెత్తించే మాస్‌ పాట ఇదని, ఈ ఏడాది హాటెస్ట్‌సాంగ్‌గా నిలుస్తుందని, శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం పేర్కొంది. హీస్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబిన్‌హుడ్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events