
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డ్స్ వేడుక రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా ముగిసింది. జైపూర్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 8వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక.. ఆదివారంతో ముగిసింది. మొదట డిజిటల్ అవార్డులను ప్రకటించిన నిర్వాహకులు, ఆదివారం రాత్రి చలనచిత్ర అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ కథ ఇలా ఏకంగా పది కేటగిరీల్లో అవార్డులు గెలుసుకుని సత్తా చాటింది. భూల్ భూలయ్యా 3 కు ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్ అవార్డు సొంతం చేసకున్నారు.

అవార్డ్స్ విజేతలు …..
ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్
ఉత్తమ నటుడు – కార్తీక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)
ఉత్తమ నటి – నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్)
ఉత్తమ దర్శకురాలు – కిరణ్ రావు (లాపతా లేడీస్)
ఉత్తమ విలన్ – రాఘవ్ జుయల్ (కిల్)
ఉత్తమ సహాయ నటి – జాంకీ బోడివాలా (షైతాన్)
ఉత్తమ సహాయ నటుడు – రవి కిషన్ (లాపతా లేడీస్)
ఉత్తమ దర్శకుడు (తొలి పరిచయం) – కునాల్ కేము (మడ్గావ్ ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ నటి (తొలి పరిచయం) – ప్రతిభా రంతా (లాపతా లేడీస్)
ఉత్తమ నటుడు (తొలిపరిచయం) – లక్ష్య (కిల్)
ఉత్తమ నేపథ్య గాయని – శ్రేయా ఘోషల్
ఉత్తమ నేపథ్య గాయకుడు – జుబిన్ నౌటియల్
ఉత్తమ సంగీత దర్శకుడు – రామ్ సంపత్ (లాపతా లేడీస్)
ఉత్తమ సాహిత్యం – ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్)
ఉత్తమ కథ (ఒరిజినల్) – బిప్లబ్ గోస్వామి (లాపతా లేడీస్)
ఉత్తమ కథ (అనువాదం) – శ్రీరామ్ రాఘవన్ (మేరీ క్రిస్మస్)
స్పెషల్ ఎఫెక్ట్స్ (విజువల్స్) – రెడ్ చిల్లీస్ VFX (భూల్ భూలయ్యా 3)
బెస్ట్ ఎడిటింగ్ – జబీన్ మర్చంట్ (లాపతా లేడీస్)
ఉత్తమ కొరియోగ్రఫీ – బోస్కో-సీజర్ (బాడ్ న్యూజ్ : తౌబా తౌబా)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – రఫీ మహమూద్ (కిల్)
ఉత్తమ డైలాగ్స్ – అర్జున్ ధావన్, ఆదిత్య ధర్, ఆదిత్య సుహాస్ జంభలే, మోనాల్ థాకర్ (ఆర్టికల్ 370)
ఉత్తమ స్క్రీన్‌ప్లే -స్నేహ దేశాయ్ (లాపతా లేడీస్)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – సుబాష్ సాహూ, బోలోయ్ కుమార్ డోలోయ్, రాహుల్ కర్పే (కిల్)
ఉత్తమ సౌండ్ డిజైన్ – సుబాష్ సాహూ (కిల్)
