Skip to main content

Namaste NRI

మండాడి నుండి సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా కథాంశంతో తమిళ నిర్మాత ఎల్రెడ్‌ కుమార్‌ నిర్మించే కొత్త తమిళ చిత్రం మండాడి. మహిమా నంబియార్‌ కథానాయిక. ప్రధాన పాత్రలో సూరి నటించనున్నారు. తెలుగు నటుడు సుహాస్‌ ఈ చిత్రంతోనే తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సూరి, సుహాస్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమాకు సెల్ఫీ చిత్ర దర్శకుడు మతిమారన్‌ పుహళేంది దర్శకత్వం వహించనున్నారు. అన్ని భాషల్లోనూ ఆకట్టుకొనే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను, సుహాస్‌ ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత విడుదల చేశారు.

Social Share Spread Message

Latest News