
మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రం లో మోహల్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 8న అమెరికా న్యూజెర్సీలో ఈ సినిమా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు మంచు విష్ణు. ఆ తర్వాత డల్లాస్, టెక్సాస్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో అభిమానులను కలుసుకొని ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. ఓవర్సీస్‌లో కూడా భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే భక్తిరస కావ్యమిదని, పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చిత్రబృందం పేర్కొంది. మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
