రవిప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 6జర్నీ. దర్శకుడు బసీర్ ఆలూరి. ఈ చిత్రం ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బసీర్ ఆలూరి చిత్ర విశేషాలను పంచుకున్నారు. దర్శకుడిగా తనకిది మూడో చిత్రమని, గోవా టూర్‌ను ఎంజాయ్ చేసి ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆరుగురి స్నేహితుల కథ ఇదని తెలిపారు.

ఈ ప్రయాణంలో వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారన్నది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ైక్లెమాక్స్‌ను సందేశాత్మకంగా తెరకెక్కించాం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యువత ఎలాంటి పోరాటం చేయాలనే అంశాల్ని చూపించాం. ైక్లెమాక్స్ ఘట్టాలు దేశభక్తిని పెంపొందిస్తాయి. బోర్డర్‌లో తెరకెక్కించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి అని తెలిపారు.
