Namaste NRI

హారర్‌ థ్రిల్లర్‌ వృశ్చికం.. షూటింగ్‌ ప్రారంభం   

మంగపుత్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సస్పెన్స్‌ హారర్‌ థ్రిల్లర్‌ వృశ్చికం. యశ్విక కథానాయిక. శివరామ్‌ నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నటులు కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విఛాన్‌ చేయగా, సుప్రీంకోర్ట్‌ అడ్వకేట్‌ హబీబ్‌ సుల్తానా క్లాప్‌ ఇచ్చారు.పరుచూరి గోపాలకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ససెన్స్‌, థ్రిల్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని, 45రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేస్తామని, రామచంద్రాపురం, భద్రాచలం, హైదరాబాద్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని, అడ్వాన్స్‌ టెక్నాలజీతో సినిమా ఉంటుందని మంగపుత్ర తెలిపారు.

Social Share Spread Message

Latest News