Skip to main content

Namaste NRI

భారత సైన్యానికి సింగిల్‌ చిత్ర బృందం విరాళం

శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందిన చిత్రం సింగిల్‌. కేతిక శర్మ, ఇవానా కథానాయికలు. కార్తీక్‌రాజు దర్శకుడు. విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదలైంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్‌ మాట్లాడారు. ఓవైపు మన సైనికులు దేశంకోసం పోరాడుతుంటే, సినిమా సెలబ్రేషన్స్‌ చేసుకోవడం సరికాదు. అందుకే కేవలం ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోడానికి మాత్రమే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాం. మన సైనికులకు సపోర్ట్‌గా నిలవడమే కాకుండా, ఈ సినిమాకు వచ్చే వసూళ్లలో కొంత భాగం సైనికుల సహాయనిధికి అందజేయనున్నాం  అని తెలిపారు.

 ఉద్రిక్తతల నడుమ ఈ మూవీని విడుదల చేయడం కరెక్ట్‌ కాదేమోనని ముందు సందేహించాం. సినిమాకోసం వందలమంది పనిచేస్తారు. థియేటర్లపై వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అందుకే తప్పుగా అర్థం చేసుకోరనే నమ్మకంతో సినిమాను విడుదల చేశాం. థియేటర్లలో ఆడియన్స్‌ రియాక్షన్స్‌ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. శ్రీవిష్ణు, వెన్నెలకిశోర్‌ అద్భుతంగా అలరించారు. ఇద్దరు హీరోయిన్లు చక్కగా నటించారు. అందరూ మెచ్చేలా సినిమాను తీసిన దర్శకుడికి అభినందనలు అని అన్నారు. ఇంకా హీరో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్‌, డైరెక్టర్‌ కార్తీక్‌రాజు, కేతిక శర్మ, ఇవానా, నిర్మాత విద్య కొప్పినీడి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events