రాజ్‌తరుణ్, కశిష్ ఖాన్ జంటగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను నాగచైతన్య విడుదల చేశారు. అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను అనుభవించు రాజా అంటూ సాగే ఈ హుషారైన పాటనిగోపీసుందర్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా రామ్ మిర్యాల ఆలపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే వినోదాత్మక కథ ఇది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ఈ పాట చూశాను.. బాగుంది. సినిమా కూడా చూశాను. జీవితాన్ని ఏంజాయ్ చేసే ఓ కుర్రాడి పాత్రను వినోదంగా చూపించారు. కోడి పందేలు, రికార్డింగ్ డ్యాన్సులు, సంక్రాంతి పండగ వాతావరణం టైటిల్ సాంగ్‌లో కనిపించాయి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆనంద్ రెడ్డి కర్నాటి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)