Skip to main content

Namaste NRI

అనుభవించు రాజ టైటిల్ సాంగ్ ను విడుదల చేసిన నాగచైతన్య

రాజ్‌తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ను నాగచైతన్య విడుదల చేశారు.  అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను అనుభవించు రాజా అంటూ  సాగే ఈ హుషారైన పాటనిగోపీసుందర్‌ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా రామ్‌ మిర్యాల ఆలపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే వినోదాత్మక కథ ఇది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ఈ పాట చూశాను.. బాగుంది. సినిమా కూడా చూశాను. జీవితాన్ని ఏంజాయ్‌ చేసే ఓ కుర్రాడి పాత్రను వినోదంగా చూపించారు. కోడి పందేలు, రికార్డింగ్‌ డ్యాన్సులు, సంక్రాంతి పండగ వాతావరణం టైటిల్‌ సాంగ్‌లో కనిపించాయి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : ఆనంద్‌ రెడ్డి కర్నాటి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News