Namaste NRI

ఎన్నారై టీడీపీ- కువైట్‌ ఆధ్వర్యంలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

ఎన్నారై టీడీపీ- కువైట్‌ ఆధ్వర్యంలో  సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గల్ఫ్‌ కౌన్సిల్‌ సభ్యులు  వెంకట్‌ కోడూరి అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా వెంకట్‌ కోడూరి మాట్లాడుతూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడు బాలయ్య అని అన్నారు.  ప్రజా సేవలో నిరంతరం ముందుండే నేత కోసం  ఇలా అంతా ఇక్కడ సమావేశం కావడం గర్వకారణమన్నారు. బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి ప్రవేశించి,  నేటికి 100కు పైగా సినిమాలో నటించి ఎన్నో విజయాలు సాధించారని తెలిపారు. ఆయన నటనలో  తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయని తెలిపారు. బాలకృష్ణ సామాజిక సేవా రంగంలోనూ నిబద్దతను చూపారని తెలిపారు. బసవతారాకం క్యాన్సర్‌ ఆసుపత్రిని తండ్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్ళుతున్నాయని కొనియాడారు. హిందూపురం ప్రజలకు ఆయన చేస్తున్న సేవలు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బాలయ్య సేవలకు గుర్తింపుగా ఇటీవల భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో  గౌరవించిందన్నారు.

ఈ  సినీ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో  టీడీపీ నాయకులు ఉదయ్‌ ప్రకాశ్‌, శ్రీనివాస్‌ చౌదరి, మోహన్‌ రాచూరి, అంజలి నాయుడు , నారాయణమ్మ, దేవి చౌదరి, జనసేన నాయకులు హరి రాయల్‌   మల్లి, పృథ్వీ,  ప్రవీణ్‌, ముస్తాఖ్‌ ఖాన్‌, ఎండీ అర్షద్‌, రెడయ్య చౌదరి, శంకర్‌ యాదవ్‌, రమేష్‌ యాదవ్‌, బాబు నాయుడు, శ్రీకాంత్‌ చింతల, మురళీ దుగ్గినేని, మురళీ కేశినేని, భాస్కర్‌ నాయుడు, రవి మలిశెట్టి, గోహర్‌ అలీ, రామయ్య యాదవ్‌, బాబు యాదవ్‌, రామకృష్ణ,    ముదిరాజ్‌ సంఘం నేతలు, పలువురు అభిమానులు  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events