మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మోహన్ బాబు, నరేశ్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంచు విష్ణు, మోహన్ బాబు ఆశీస్సులు తీసుకున్నారు. అయితే విష్ణు ప్యానెల్ నుంచి గెలుపొందిన రఘుబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. విష్ణు ప్యానెల్ నుంచి రఘు బాబు ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)