Skip to main content

Namaste NRI

మా అధ్యక్షుడి గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయన ప్యానెల్‌ సభ్యుల చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మోహన్‌ బాబు, నరేశ్‌ తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంచు విష్ణు, మోహన్‌ బాబు ఆశీస్సులు తీసుకున్నారు. అయితే విష్ణు ప్యానెల్‌ నుంచి గెలుపొందిన రఘుబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. విష్ణు ప్యానెల్‌ నుంచి రఘు బాబు ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events