ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యా ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని యోచిస్తోంది. మాస్కోతో వ్యాపార సంబంధా లు కొనసాగిస్తున్న భారత్, చైనాపై 500 శాతం సుంకాలు విధిస్తామని రిపబ్లికన్ సెనేటర్ ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా నాటో కూడా ఇలాంటి హెచ్చరికలే చేసింది.

మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్‌పై 100 శాతం సుంకం విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు.. ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు , గ్యాస్ వంటివి కొనుగోలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా దేశాలపై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.
















