
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను మరోసారి టార్గెట్ చేశారు. మిత్రదేశం అని చెప్పుకుంటూనే 50శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేపడుతుండడంతోపై ట్రంప్ 25శాతం అదనంగా సుంకాలు విధించారు. సుంకాలు అమలు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకాలు చేశారు. సుంకాలు ఆగస్టు 7 నుంచి అమలులోకి రానున్నాయి. అదనపు సుంకాలు 21 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది. ట్రంప్ తొలి సుంకాలు అమలులోకి రావడానికి 14గంటల ముందు అదనంగా సుంకాలు విధించేందుకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. జులై 30న ట్రంప్ భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పన్నుల ఆగస్టు 7 నుంచి అమలులోకి రానుండగా, అదనపు సుంతకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తాయి. రష్యా నుంచి భారీగా చమురును కొనుగోలు చేస్తుందని, తద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సహాయపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.















