
ప్రతిష్టాత్మక గామా (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) పురస్కారాలకు సర్వత్రా మంచి క్రేజ్ ఉంది. తాజాగా వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో 5వ ఎడిషన్ గామా వేడుకలు దుబారులోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో అతిరథ మహారథుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ అవార్డుల వేడుక జరిగింది.గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ దర్శకులు ఏ.కోదండ రామిరెడ్డి, సంగీత దర్శకులు కోటి, దర్శకులు బి.గోపాల్ వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు గామా అవార్డులను బహుకరించారు.
















