
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. నేడు పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్ త్రీపీస్ సూట్‌పై కౌబాయ్ క్యాప్ ధరించి ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ నెల 6 నుంచి మొదలయ్యే కొత్త షెడ్యూల్‌లో పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని మేకర్స్ తెలిపారు. శ్రీలీల, రాశీఖన్నా, పార్థిబన్, కె.ఎస్.రవికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.















