Namaste NRI

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్

పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.  తాజా షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. నేడు పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్‌ త్రీపీస్‌ సూట్‌పై కౌబాయ్‌ క్యాప్‌ ధరించి ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ నెల 6 నుంచి మొదలయ్యే కొత్త షెడ్యూల్‌లో పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని మేకర్స్‌ తెలిపారు. శ్రీలీల, రాశీఖన్నా, పార్థిబన్‌, కె.ఎస్‌.రవికుమార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్‌ ఎస్‌.

Social Share Spread Message

Latest News