Skip to main content

Namaste NRI

ఆంధ్ర కింగ్‌ తాలూకా సెకండ్‌ సింగిల్‌..పప్పీ షేమ్‌ రిలీజ్‌

ఆంధ్ర కింగ్‌ తాలూకా సినిమా కోసం చిత్ర కథానాయకుడు రామ్‌ పోతినేని. నువ్వుంటే చాలే  అనే ఓ పాటను రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ గీతం శ్రోతల్ని అలరిస్తున్నది. ఈ చిత్రంలోని రెండో గీతం పప్పీ షేమ్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ పాటను హీరో రామ్‌ ఆలపించడం విశేషం. వివేక్‌ అండ్‌ మెర్విన్‌ స్వరపరచిన ఈ గీతాన్ని భాస్కరభట్ల రచించారు. ఎనర్జిటిక్‌ బీట్‌తో యూత్‌ని ఆకట్టుకునేలా ఈ పాట సాగింది.

ఈ సినిమాలో హీరో రామ్‌ ఓ సినీ హీరో అభిమాని పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. తన అభిమాన హీరో సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ, పందెం ఓడిపోయిన యాంటీ ఫ్యాన్స్‌ను ట్రోల్‌ చేస్తున్నట్లుగా పప్పీ షేమ్‌ గీతం సాగింది. రామ్‌ తన గ్యాంగ్‌తో సెలబ్రేషన్‌ మోడ్‌లో కనిపించారు. భాగ్యశ్రీబోర్సే, ఉపేంద్ర, రావు రమేష్‌, మురళీశర్మ, సత్య తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 28న విడుదలకానుంది.  ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ అండ్‌ మెర్విన్‌, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌బాబు.పి.

Social Share Spread Message

Latest News