
అధికారంలోకి వచ్చింది మొదలు టారిఫ్‌లు, వలస విధానాలతో ఆయా దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు దక్షిణ కొరియా గట్టి షాక్ ఇచ్చింది. దీంతో విదేశీ సంస్థల ఉద్యోగులకు స్వాగతమంటూ ట్రంప్ ఓ ప్రకటన చేయాల్సి వచ్చింది. అమెరికా పరిశ్రమలకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని ట్రంప్ చెప్పారు. దీనికంటే ముందు, తమ దేశ వ్యాపార సంస్థలు యూఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతాయని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జూ మ్యూంగ్ హెచ్చరించారు. దీంతో ట్రంప్ దిగిరాక తప్పలేదు.















