ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా రూపొందిన మూవీ డ్యూడ్. మమిత బైజు కథానాయిక. కీర్తిశ్వరన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మూడోపాటను విడుదల చేశారు. సింగారి సిన్నదానా.. నీ ఇంటి దారుల్లోనా అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరచి స్వయంగా ఆలపించారు.

హీరో ప్రదీప్ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సాగే సన్నివేశాలు ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చాయి. యూత్ మెచ్చేలా మంచి బీట్తో పాట సాగింది. శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం ఇతర పాత్రధారులు. ఈ నెల 17న దీపావళి కానుకగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి.
















