Skip to main content

Namaste NRI

సింగారి చిన్నదాన.. డ్యూడ్‌ సినిమా నుంచి మరో పాట రిలీజ్‌

ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా రూపొందిన మూవీ డ్యూడ్‌. మమిత బైజు కథానాయిక. కీర్తిశ్వరన్‌ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌ బస్టర్స్‌గా నిలిచాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మూడోపాటను విడుదల చేశారు. సింగారి సిన్నదానా.. నీ ఇంటి దారుల్లోనా అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ స్వరపరచి స్వయంగా ఆలపించారు.

హీరో ప్రదీప్‌ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సాగే సన్నివేశాలు ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చాయి. యూత్‌ మెచ్చేలా మంచి బీట్‌తో పాట సాగింది. శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రోహిణి మొల్లెటి, హృదు హరూన్‌, ద్రవిడ్‌ సెల్వం ఇతర పాత్రధారులు. ఈ నెల 17న దీపావళి కానుకగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: నికేత్‌ బొమ్మి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events