Skip to main content

Namaste NRI

తిలక్‌వర్మని సన్మానించిన మెగాస్టార్‌

ఇటీవల ఆసియాకప్‌ ఫైనల్లో అద్భుత ప్రతిభ కనబరిచి భారత్‌కు విజయాన్నందించడంలో కీలక పాత్ర పోషించిన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ తిలక్‌వర్మను మెగాస్టార్‌ చిరంజీవి సన్మానించారు. గురువారం మనశంకర వరప్రసాద్‌గారు సెట్స్‌కి తిలక్‌వర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన్ని శాలువాతో సత్కరించి, మ్యాచ్‌లోని మెమొరబుల్‌ మూమెంట్‌ని ఫ్రేమ్‌ చేసిన ఫొటోని అందించారు. ఈ సందర్భంగా తిలక్‌వర్మ ప్రతిభాపాటవాల్ని ప్రశంసించారు.

ఈ వేడుకలో నయనతార, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాతలు సాహు గరపాటి, సుస్మిత కొణిదెల తదితరులు సైతం పాల్గొని, తిలక్‌ వర్మ ఆడిన తీరును ప్రశంసించారు. తనని పిలిచి, ప్రేమతో సన్మానించిన మెగాస్టార్‌కి ఈ సందర్భంగా క్రికెటర్‌ తిలక్‌ వర్మ కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events