Namaste NRI

సౌండ్‌ కంట్రోల్‌లో పెట్టుకోవాలంటూ బాలయ్య వార్నింగ్‌.. అఖండ 2 మరో గ్లింప్స్‌ రిలీజ్‌

బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న సినిమా అఖండ 2: తాండవం. ఇది వీరి సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ అఖండ కు సీక్వెల్‌. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇంటెన్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ద్వారా అఖండ పాత్రను పరిచయం చేసిన మేకర్స్‌ ఇప్పుడు ఇందులో బాలకృష్ణ చేస్తున్న మరో పాత్రను రివీల్‌ చేస్తూ అఖండ 2: బ్లాస్టింగ్‌ రోర్‌ టైటిల్‌తో మరో గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.

ఇందులో బాలకృష్ణ పూర్తి స్థాయి మాస్‌ అవతార్‌లో హై-వోల్టేజ్‌ యాక్షన్‌తో మెస్మరైజ్‌ చేశారు. బోయపాటి శ్రీను తన సిగేచర్‌ స్టైల్‌లో బాలయ్యని అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు. ఇందులో సౌండ్‌ కంట్రోల్‌లో పెట్టుకో. ఏ సౌండ్‌కి నవ్వుతానో, ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలియదు. ఊహకి కూడా అందదు అని బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ గూజ్‌ బంప్స్‌ తెప్పించింది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్‌ ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events