Namaste NRI

యూఏఈలో తెలుగు వ్యక్తికి జాక్ పాట్

అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల అనిల్‌కుమార్‌ బొల్లా అనే ఏపీ యువకుడు యూఏఈ లాటరీ చరిత్రలోనే అతి పెద్దదైన 100 మిలియన్‌ దిర్హామ్‌లు (సుమారు రూ. 240 కోట్లకు పైగా) జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. అక్టోబరు 18న జరిగిన 23వ లక్కీ డే డ్రాలో అనిల్‌కుమార్‌ ఈ బహుమతిని గెలుచుకున్నట్టు లాటరీ నిర్వాహకులు వెల్లడించారు. తన విజయం గురించి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ తాను ప్రత్యేకంగా మ్యాజిక్‌ ఏమీ చేయలేదని, ఈజీ పిక్‌ ద్వారా టికెట్‌ను ఎంచుకున్నానని తెలిపాడు. కానీ ఆ టికెట్‌లోని చివరి నంబర్‌ చాలా ప్రత్యేకమని, అది తన తల్లి పుట్టిన రోజు అని చెప్పాడు. గెలిచిన విషయం తెలియగానే, తాను సోఫాలో కూర్చుని షాక్‌లో ఉండిపోయానని తన ఆనందాన్ని పంచుకున్నాడు. పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో, ఆ డబ్బును బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలని, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పాడు. తాను పెద్ద మొత్తాన్ని గెలిచానని, ఇప్పుడు సరైన మార్గంలో ఆలోచించి మంచి పని చేయాలనుకుంటున్నానని అన్నాడు.

Social Share Spread Message

Latest News