నటి త్రిషకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిషనే కావడం విశేషం. 2019 నుండి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేస్తుండగా, తాజాగా ఇది త్రిషక్క దక్కింది. ఈ వీసా కలిగిన వారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. గెల్డ్‌న్ వీసాలను ఐదేళ్ల లేదంటే 10 ఏళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాఖ వాటంతట అవే రెన్యువల్ అవుతాయి. యూఏఈ గోల్డెన్ వీసా పొందిన విషయాన్ని త్రిష స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)