Namaste NRI

ఆ దేశాని వదిలి రండి : అమెరికా సూచన

వెనిజులాలో నివసిస్తున్న తన పౌరులను వెంటనే ఆ దేశం విడిచి రావాలని అమెరికా సూచించింది. వెనిజులా సాయుధ దళాలు తమ దేశంలోని అమెరికా పౌరులను వెంటాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ మేరకు భద్రతాపరమైన అలర్ట్‌ జారీ చేసింది. వెనిజులా ప్రభుత్వ అనుకూల మిలీషియాకు చెందిన సాయుధ సభ్యులు రోడ్లను దిగ్బంధించి, వాహనాలను తనిఖీ చేస్తున్నారని, వాటిలో అమెరికా పౌరులు లేదా ఆ దేశ మద్దతుదారులు ఉన్నారేమో చూస్తున్నారని వార్తలు వస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది.

వెనిజులాలో ఉంటున్న అమెరికా పౌరులు జాగరూకులై ఉండాలి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి అని చెప్పింది. వెనిజులా నుంచి కొన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమైనందు న వెంటనే అక్కడి నుంచి బయటపడాలని సూచించింది. మదురో దంపతుల అపహరణ తర్వాత వెనిజులాలో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నదో అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటన తెలియజేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events