శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నారీ నారీ నడుమ మురారి. సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలు. రామ్ అబ్బరాజు దర్శకుడు.అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఏపీ ఆత్రేయపురంలో జరిగిన ఈవెంట్‌లో శర్వానంద్ మాట్లాడారు. ఇది అందర్నీ హ్యాపీగా నవ్వించాలని చేసిన సినిమా. చాలా క్లీన్ ఫిల్మ్. మంచి కథను అద్బుతమైన హ్యూమరస్‌గా చెప్పాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఈ సినిమా నాకు నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుందని నా నమ్మకం. టికెట్ ధరల్ని మేం పెంచడం లేదు. అందుబాబులో ఉన్న ధరలే ఉంటాయి. అందరూ ఈ సినిమాకొచ్చి ఆనందంగా నవ్వితే అదే మాకు అసలైన సంక్రాంతి అని అన్నారు.

ఇది మెమొరబుల్ జర్నీ. డైరెక్టర్ అబ్బరాజు అద్భుతమైన క్యారెక్టర్ రాశారు. నిత్య క్యారెక్టర్ చాలా స్పెషల్. శర్వాతో నటించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది అని హీరోయిన్ సాక్షి వైద్య చెప్పారు. హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీ. థియేటర్లో ఫ్యామిలీతో పాటు అందరూ ఎంజాయ్ చేసేలాగా ఈ సినిమా ఉంటుంది. డైరెక్టర్ ఈ సినిమాని కంప్లీట్ ఎంటర్టైనర్‌గా ప్యాక్ చేశారు. నాకు దియా అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇందులో ప్రతి సీన్ హిలేరియస్‌గా ఉంటుంది. సినిమా సంక్రాంతి ఫీస్ట్‌లాగా ఉండబోతుంది అని అన్నారు.















