
తమ దేశంలోని విమానాశ్రయాల మీదుగా ప్రయాణించే భారతీయ పాస్‌పోర్టు హోల్డర్లకు వీసా-ఫ్రీ ట్రాన్సిట్ సౌకర్యాన్ని జర్మనీ ప్రకటించింది. ఈ చర్యతో భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణం సులభతరం కావడమేగాక రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేసే అవకాశం ఉంది. ఈ నెల 12-13న జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ భారత పర్యటన సందర్భంగా ప్రకటన వెలువడింది. ఇది మెర్జ్ భారత తొలి పర్యటనేగాక జర్మనీ చాన్సలర్‌గా ఆసియాకు మొదటి సందర్శన. వీసా-ట్రాన్సిట్ సౌకర్యం వల్ల జర్మనీ మీదుగా వేరే దేశానికి ప్రయాణించే భారతీయ ప్రయాణికులు విడిగా ట్రాన్సిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవలసిన అవసరం ఉండదు.















