Namaste NRI

భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పెద్ది షూటింగ్.. ఎక్కడో తెలుసా?

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకున్నది. ఇటీవలే ఢిల్లీ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఈ నెల చివర్లో చిత్రబృందం యూరప్‌ వెళ్లనుంది. అక్కడ జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుందని సమాచారం. యూరప్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తోపాటు రామ్‌చరణ్‌, జాన్వీలపై ఓ పాటను కూడా చిత్రీకరిస్తారట.

ఈ సినిమా ైక్లెమాక్స్‌ విషయంలో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కథ రీత్యా ఓ ప్రమాదంలో హీరో రెండు కాళ్లూ ఇందులో దెబ్బతింటాయట. అయినప్పటికీ రన్నింగ్‌లో హీరో ఛాంపియన్‌గా నిలుస్తాడట. ఈ ఎపిసోడ్‌ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తున్నది. ఇప్పటివరకూ రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన సినిమాలన్నింటిలో భిన్నంగా పెద్ది ఉంటుందనేది ఇన్‌సైడ్‌ టాక్‌. మార్చి 27న సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్‌.రెహ్మాన్‌, నిర్మాతలు: వెంకటసతీశ్‌ కిలారు, ఇషాన్‌ సక్సేనా, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ సినిమాస్‌, నిర్మాణం: వృద్ది సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events