Namaste NRI

ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి : డొనాల్డ్ ట్రంప్ 

ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తాజాగా ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌పై ఏ మేర ప్రభావం చూపిస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రష్యాతో చమురు కొనుగోళ్ల కారణంగా 50 శాతం సుంకాలు విధిస్తామనే హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, తాజా నిర్ణయం మరో ఆర్థిక ఒత్తిడే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ వ్యాపారంపై కూడా అదనపు టారిఫ్‌లు విధిస్తే, అమెరికా – భారత్ వాణిజ్య చర్చలు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా టారిఫ్‌ల సడలింపు కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్ తాజా నిర్ణయం ఆ ప్రయత్నాలకు ఆటంకంగా మారవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events