
హవీష్ హీరోగా అగ్ర దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ నేను రెడీ. కావ్య థాపర్ కథానాయిక. హర్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి పతాకంపై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలపై మంచి హైప్ క్రియేటయ్యిందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే మధ్య తరగతి ఆంధ్ర యువకుడికీ, ఒక మధ్య తరగతి తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం జరగడం, రెండు ప్రాంతాల భిన్న నాగరికతల కారణంగా వారిద్దరి మధ్య ఊహించని సంఘర్షణ ఎదురవ్వడం ట్రైలర్‌లో ఆసక్తికరంగా అనిపించింది. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, మురళీశర్మ, వీటీవీ గణేశ్, గోపరాజు రమణ, హరితేజ, రూపలక్ష్మి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: మిక్కీ జె.మేయర్.















