
వరుణ్‌సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హలో ఇట్స్ మీ. షగ్నశ్రీ వేణున్ కథానాయికగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది. దర్శన్ మదమంచి మరో హీరో. వీఎస్‌కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్ నిర్మాతలు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ చాలాకాలంగా థ్రిల్లర్ సినిమాలే చేస్తున్న నాకు ఈ సినిమా ఓ మార్పు. ఇది చక్కటి కుటుంబ కథ. అపార్థాల వల్ల ఓ జంట ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. నా హ్యాపీడేస్, కొత్త బంగారులోకం పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇందులోని పాటలు కూడా కొన్నాళ్ల పాటు వినిపిస్తాయి అని చెప్పారు. ప్రతి అమ్మాయికీ, ప్రతి అబ్బాయికీ రిలేటయ్యే కథ ఇదని చిత్ర కథానాయిక, డైరెక్టర్ షగ్న శ్రీవేణున్ అన్నారు.















