Namaste NRI

వలసదారులకు నో బెయిల్‌

అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం బాండ్‌ లేకుండా వలసదారుల నిర్బంధాన్ని కొనసాగించవచ్చునని ఐదవ సర్క్యూట్‌ కోర్డ్‌ ఆఫ్‌ అప్పీల్స్‌లోని ప్యానల్‌ న్యాయమూర్తులు రూలింగ్‌ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్‌ బాండ్‌ అంటే అక్రమ వలసదారుల పేరుతో అమెరికా అధికారులు విదేశీయులను అదుపులోకి తీసు కుంటున్న విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరవుతామని హామీ ఇస్తే తాత్కాలికంగా వారిని విడుదల చేస్తారు. ఇందు కోసం కొంత మొత్తాన్ని పూచీకత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక రకమైన బెయిల్‌ వంటిది. విచారణ కాలంలో వలసదారులు సక్రమంగా హాజరైతే అది ముగిసిన తర్వాత వారికి బాండ్‌ సొమ్ము వాపసు చేస్తారు.

ఒకవేళ కోర్టుకు హాజరు కాకపోయినా లేదా నిబంధనలను పాటించకపోయినా బాండ్‌ సొమ్మును జప్తు చేస్తారు. దేశవ్యాప్తంగా అరెస్టయిన వలసదారుల బాండ్‌ విచారణలను నిరాకరించాలని హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం నిర్ణయించింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్యానల్‌ న్యాయమూర్తులు తోసిపుచ్చారు. హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి, ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ చట్టానికి అనుగుణంగానే ఉన్నదని తీర్పు చెప్పారు. దీని ప్రకారం వలసదారులు ఎంత కాలం అమెరికాలో నివసిస్తున్నారన్న దానితో నిమిత్తం లేకుండా బాండ్‌పై విడుదల చేసేందుకు అనుమతించరు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events