Namaste NRI

విశ్వనాథ్ అండ్‌ సన్స్ నుంచి తొలి పాట నేనో బటర్‌ఫ్లై వచ్చేసింది

ఇరవయ్యవ పడిలో ఉన్న ఓ అమ్మాయి, నలభై ఏండ్ల వయసున్న వ్యక్తి ప్రేమలో పడితే వారి సంక్లిష్ట బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? వయోవ్యత్యాసం తాలూకు భావోద్వేగాలు, నైతిక సంఘర్షణ వారి బంధాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవాలంటే విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ సినిమా చూడాల్సిందే. ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సూర్య, మమితాబైజు, రవీనా టాండన్‌, రాధికా శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రధారులు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.

నేనో బటర్‌ఫ్లై అనే తొలిపాటను విడుదల చేశారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ స్వరపరచిన ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు. సుభాషిని ఆలపించారు. పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగ, చుట్టా బొంగరంగా నిన్నే చుట్టుకోగ.. గుడ్‌మార్నింగ్‌ సూర్యుడల్లే తట్టి నిద్రలేపినావే నాలో ప్రేమని, గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చుకోవే బుజ్జి గుండెలోకి వెల్కమ్‌ అంటూ రమ్మని..నేనో బటర్‌ఫ్లై అంటూ ప్రేమలోని భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తూ ఈ పాట సాగింది. హృదయానికి హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అన్ని వర్గాలను అలరించే సినిమా ఇదని మేకర్స్‌ తెలిపారు. ఆగస్ట్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events