Skip to main content

Namaste NRI

అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందంపై నీలినీడలు!

పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే ఒప్పందం కోసం అమెరికా, ఇరాన్‌ మధ్య జరగవలసిన చర్చలు రద్దయ్యాయి. చర్చలు జరగడం లేదని స్విట్జర్లాండ్‌ వెల్లడించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన స్విస్‌ పర్యటనను రద్దు చేసుకోవడంతో శాశ్వత కాల్పుల విరమణపై అనిశ్చితి మరింత పెరిగింది. ఈ చర్చలకు సంబంధించిన కార్యకలాపాలు ఎప్పడూ సజావుగా, ఊహించిన విధంగా లేవని వైట్‌ హౌస్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రణాళికలు ఖరారైన వెంటనే స్విట్జర్లాండ్‌కు బయల్దేరడానికి వాన్స్‌, అమెరికా ప్రతినిధి బృందం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. బర్జెన్‌స్టాక్‌ మౌంటెన్‌టాప్‌ రిసార్టులో జరగాల్సిన చర్చలు జరగడం లేదని స్విట్జర్లాండ్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. అయితే వివరాలను తెలియచేయలేదు. 14 అంశాలతో కూడిన ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ సంతకాలు చేసిన అనంతరం శుక్రవారం ప్రారంభం కావలసిన సాంకేతిక చర్చలకు తాము సిద్ధమని ఇదివరకు ప్రకటించిన ఇరాన్‌ ప్రస్తుత పరిణామాలపై ఇప్పటివరకు స్పందించలేదు.

Social Share Spread Message

Latest News