Namaste NRI

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్

విమాన ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు, లేదా మార్పు చేసుకోవచ్చు. అయితే పలు షరతులు వర్తిస్తాయి. ఈ మేరకు డీజీసీఏ టికెట్‌ రిఫండ్‌ నిబంధనలను సవరించింది. టికెట్‌బుక్‌ చేసుకున్న తర్వాత 48 గంటలపాటు విమానయాన సంస్థలు లుక్‌ ఇన్‌ ఆప్షన్‌ ను ఇవ్వాలి. ఈ గడువులో ప్రయాణికులు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. లేదా మార్పు చేసుకోవచ్చు. అయితే ఎంచుకున్న కొత్త తేదీలో టికెట్‌ ధరలో మార్పులు ఉంటే, ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ విమానాల్లో ప్రయాణ తేదీకి 7 రోజులు ఉండగా బుక్‌ చేసుకున్న టికెట్‌కు ఈ లుక్‌ ఇన్‌ ఆప్షన్‌ వర్తించదు.

అలాగే అంతర్జాతీయ విమానాలకు ప్రయాణ తేదీ 14 రోజులు ఉండగా బుక్‌ చేసుకున్న టికెట్‌కు కూడా ఈ సౌలభ్యం వర్తించదు. ట్రావెల్‌ ఏజెంట్‌ లేదా వారి పోర్టల్స్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకుంటే రిఫండ్‌ బాధ్యత విమానయాన సంస్థలదే. 14 రోజుల్లోగా రిఫండ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. విమానాయాన సంస్థ అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు 24 గంటల్లోపు తమ పేరులో మార్పులు ఉంటే చేయమని కోరవచ్చు. వారి నుంచి అదనపు చార్జీ వసూలు చేయరాదు. మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా టికెట్‌ రద్దు చేసే నిబంధనల్లోనూ డీజీసీఏ సవరణలు చేసింది. ప్రయాణికుడు లేదా అదే పీఎన్‌ఆర్‌ నంబర్‌ ఉన్న టికెట్‌లో పేరు ఉండే కుటుంబసభ్యులు ప్రయాణ తేదీ నాడు దవాఖానలో చేరినట్టయితే రిఫండ్‌ లేదా క్రెడిట్‌ షెల్‌ ఆప్షన్‌ను కోరవచ్చు.

Social Share Spread Message

Latest News