Skip to main content

Namaste NRI

రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం

దాదాపు నాలుగు నెలల యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, ఇరాన్‌ ఒక శాంతి ఒప్పందంపై అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందంపై వర్చువల్‌గా సంతకం చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ ఘాలీబాఫ్‌ ఇప్పటికే ఆ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారని అమెరికా చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. వచ్చే శుక్రవారం(జూన్‌ 19) దీనికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుండగా ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు రానున్న 48 గంటల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మధ్యవర్తిత్వ ప్రయత్నాలలో ఒమన్‌ పోషించిన పాత్ర పట్ల అమెరికా అసంతృప్తితో ఉందని ఒక సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. అలాగే అమెరికాతో ఒప్పందంపై చర్చలు జరగడానికి, దానిపై సంతకం చేయడానికి ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌కు ఆ దేశ సుప్రీం నాయకుడి మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ ఉపసంహరణ అనేది ఈ ఒప్పందంలో ఒక షరతు కాదని ఆ అధికారి వివరించారు. అయితే ఇరాన్‌ దీనికి భిన్నమైన వాదనలు చేస్తున్నది.

Social Share Spread Message

Latest News