అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా అద్భుతమైన విజయాన్ని అందుకుని చాంపియయన్స్ నిలిచారు. సొంత గడ్డ పై సగర్వంగా ప్రపంచ కప్పును ముద్దాడింది.ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ను భారత్ చిత్తుగా ఓడించింది.మంచి బ్యాటింగ్ ఫామ్ లో ఉన్న సంజూ శ్యాంసన్ ఈ సారి కూడా అద్భుతంగా ఆడి న్యూజిలాండ్ ను చిత్తు చేశాడు, శివం థూబే మంచి స్కోర్ చేశాడు, బుమ్రా, అక్షర్ పటేల్ ప్రత్యర్థి బ్యాటింగ్ కు చెక్ పెట్టారు.


ఫైనల్‌లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 96 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో టీం ఇండియా మూడు సార్లు ట్రోఫీని దక్కించుకుని చరిత్ర సృష్టించింది. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు వుంచగా ఇంకా విజయానికి 96 పరుగులు వుండగానే 157 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది, బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో 4 వికెట్ తీశాడు, అక్షర్ పటేల్ 3 వికెట్స్ తీశారు.
అద్భుతమైన బ్యాటింగ్ తో శ్యాంసన్ 89 పరుగులు చేశాడు.




















