కెనడాలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంటారియో రాష్ట్రంలో ఉన్న డుర్హం తెలుగు సంస్థ ఆధ్వర్యంలో తెలుగు వారు దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దీపావళి వేడుకలకు ముఖ్య అతిథిగా కెనడా ఎంపీ ర్యాన్ టర్న్‌బుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా అభివృద్ధికి భారతీయలు కృషి చేస్తున్నారని తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఎంతో నేర్పించిందన్నారు. ఈ వేడుకల్లో డీటీసీ అధ్యక్షుడు నరసింహా రెడ్డి, రమేశ్ ఉప్పలపాటి, డీటీసీ కార్యవర్గ సభ్యులు రవి మేకల, గౌతమ్ పిడపర్తి, శ్రీకాంత్ సింగిశెట్టి, వెంకట్ చిలువేరి, సర్దార్ ఖాన్, కమల మూర్తి, భారీ సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.














