Skip to main content

Namaste NRI

కెనడాలో ఘనంగా దీపావళి వేడుకలు

కెనడాలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంటారియో రాష్ట్రంలో ఉన్న డుర్హం తెలుగు సంస్థ ఆధ్వర్యంలో తెలుగు వారు దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దీపావళి వేడుకలకు ముఖ్య అతిథిగా కెనడా ఎంపీ ర్యాన్‌ టర్న్‌బుల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా అభివృద్ధికి భారతీయలు కృషి చేస్తున్నారని తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఎంతో నేర్పించిందన్నారు. ఈ వేడుకల్లో డీటీసీ అధ్యక్షుడు నరసింహా రెడ్డి, రమేశ్‌ ఉప్పలపాటి, డీటీసీ కార్యవర్గ సభ్యులు రవి మేకల, గౌతమ్‌ పిడపర్తి, శ్రీకాంత్‌ సింగిశెట్టి, వెంకట్‌ చిలువేరి,  సర్దార్‌ ఖాన్‌, కమల మూర్తి, భారీ సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News