Namaste NRI

న్యూజిలాండ్ కీలక నిర్ణయం…

న్యూజిలాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్‌ల విషయంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకాకు, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు న్యూజీలాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్‌ ముక్తేష్‌ ప్రదేశీ తెలిపారు. న్యూజిలాండ్‌ పాజిటివ్‌ నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను గుర్తింపు పొందిన టీకాల జాబితాలో చేర్చింది. ప్రయాణ ఆంక్షలు ఎత్తేయడం గురించి ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. వ్యాక్సిన్‌ తీసుకున్న టూరిస్ట్‌లకు భారత్‌ ఇప్పటికే స్వాగతం తెలుపుతోంది అని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌ నిర్ణయంతో రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న భారత ప్రయాణికులకు క్వారెంటైన్‌ బాధలు తప్పనున్నాయి.

Social Share Spread Message

Latest News