తీవ్ర ఉద్రిక్తతలతో సమతమవుతున్న ఇజ్రాయెల్, లెబనాన్‌లో దేశాల్లో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. అమెరికా మధ్య వర్తిత్వంతో ఈ రెండు దేశాల మధ్య అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఒక చరిత్రాత్మక ఫ్రేమ్‌వర్క్ శాంతి ఒప్పందం కుదిరింది. శాంతి ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. హిజ్బుల్లా వంటి సాయుధ గ్రూపుల నిరాయుధీకరణ, లెబనాన్ సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించడం, రెండు దేశాల మధ్య శత్రుత్వాలకు ముగింపు పలకడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందం శాశ్వత శాంతి భద్రతల కోసం ఒక చట్రాన్ని ఏర్పాటు చేయడానికి నాంది పలుకుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు.

ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ పరస్పర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ రెండు దేశాలు రెండూశాంతియుతంగా జీవిస్తూ తమ తమ దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని ఇరుదేశాల మధ్య ఇతర దేశాల జోక్యాన్ని నిలిపివేయాలని పేర్కొన్నాయి.





























