Namaste NRI

రష్యాపై 9/11 తరహాలో ఉక్రెయిన్‌ దాడి

అమెరికాలో జరిగిన 9/11 దాడుల తరహాలో రష్యాకు చెందిన కజాన్‌ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు నిర్వహించింది. కమికాజ్‌ డ్రోన్లతో ఉక్రెయిన్‌ ఈ దాడులు జరిపినట్లు తెలిసింది.  బహుళ అంతస్తుల నివాస భవనాలను డ్రోన్లు నేరుగా ఢీకొన్న దృశ్యాలను 9/11 తరహా దాడులుగా కొందరు నెటిజన్లు అభివర్ణించారు. దాడి జరిగిన ప్రాంతానికి ఎమర్జెన్సీ సర్వీసులు బయల్దేరి వెళ్లినట్లు తెలిసింది.  ఈ దాడిలో ప్రాణనష్టం జరిగినట్లు తెలియరాలేదని, దాడికి గురైన భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిసింది. తమ టటరస్తాన్‌ రిపబ్లిక్‌పై ఎగురుతున్న మానవ రహిత వాహనాన్ని రక్షణ దళాలు కూల్చివేసినట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress