అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై బయోపిక్ చిత్రాన్ని తీశారు. ద అప్రెంటిస్ టైటిల్‌తో ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రఖ్యాత డైరెక్టర్ అలీ అబ్బాసీ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1970 దశకంలో న్యూయార్క్‌లో ఎలా డోనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారో చూపించనున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ్‌లో పామ్ డీ ఓర్ అవార్డు కోసం ఆ సినిమా పోటీ పడనున్నది. ట్రంప్ పాత్రను నటుడు సెబాస్టియన్ స్టాన్ పోషిస్తున్నాడు. లాయర్ రాయ్ కోన్ పాత్రను నటుడు జెర్మీ స్ట్రాంగ్ పోషిస్తున్నాడు. ట్రంప్ మొదటి భార్య ఇవానా జెల్నికోవా పాత్రను బల్గేరియా నటి మారియా బకలోవా పోషిస్తున్నారు. వ్యాపారంలోకి అడుగుపెట్టిన ట్రంప్ ఎలా ఎదిగారు, తన తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అతను ఎలా డెవలప్ చేశాడన్న కోణంలో ద అప్రెంటిస్ సినిమాను తీశారు. తొలుత రెసిడెన్షియల్ ప్రాపర్టీలపై కంపెనీ ఫోకస్ చేస్తుందని, ఆ తర్వాత క్యాసినోలు, హోటళ్లపై దృష్టి మళ్లిస్తుంది. మన్‌హటన్‌లో ట్రంప్ టవర్ నిర్మాణం గురించి కూడా చిత్రంలో చూపించనున్నారు. అయితే ఆ ఫిల్మ్‌ను వచ్చే నెలలో జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు.