Namaste NRI

భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక సమావేశం

విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తో  ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ ఢిల్లీలో సమావేశం అయ్యారు. హైదరాబాద్ హౌస్‌లో ఈ ఇద్దరి మధ్య సమావేశం జరగ్గా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడంపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. రెండు వైపులా కొత్త కాన్సులేట్స్, డైరెక్ట్ ఫ్లైట్ కనెక్షన్స్, విద్యా రంగంలో పురోగతితో పాటు ఇతర అనేక కార్యక్రమాలపై చర్చలు జరిగినట్టు తెలిసింది. ఈ సందర్బంగా  విలేకరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఊపందుకుంటోందని అన్నారు. పీఎం ఆంథోనీ అల్బనీస్ సెప్టెంబరులో జీ20 సమ్మిట్ కోసం భాతరదేశానికి వచ్చారని తెలిపారు.   ఈ జీ20 సదస్సుకు అధ్యక్ష వహించేందుకు భారత్‌కు ఆస్ట్రేలియా బలమైన సహకారం అందించిందన్నారు. 14వ విదేశాంగ మంత్రి ఫ్రేమ్‌వర్క్ డైలాగ్ ఇప్పుడే ముగిసిందన్న ఆయన,  తమ మధ్య గొప్ప సమావేశం సాగిందన్నారు. ఈ భేటీలో చాలా విషయాల గురించి చర్చించామని తెలిపారు. క్వాడ్ గురించి తాము వివరంగా చర్చించామని, కొన్నేళ్లుగా క్వాడ్ చాలా పురోగతి సాధించిందని అన్నారు. పరస్పరం సహకరించుకునే అంశాలు ఇంకా అనేకం ఉన్నాయని,  ఈ చర్చలో తాము క్వాడ్‌కు ఇంకా ఏం జోడించగలమన్న దానిపైనే ఎక్కువగా చర్చలు జరిపామని చెప్పుకొచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress