చైతన్యరావు, హెబ్బాపటేల్ జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్. బాలరాజశేఖరుని ఈ చిత్రానికి దర్శకుడు. కె.కె.ఆర్, బాలరాజ్ నిర్మాతలు. సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది. హీరో అడివి శేషు చేతులమీదుగా మూడవ పాటను విడుదల చేశారు. క్యూట్‌గా.. స్వీట్‌గా అంటూ సాగే ఈ పాటను కిట్టూ విస్సాప్రగడ రాయగా, కల్యాణిమాలిక్ స్వరపరిచారు. దీపు ఆలపించారు. చిత్ర యూనిట్ కి అడివి శేషు శుభాకాంక్షలు అందించారు.
ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకు చెందిన రెండు పాటలను విడుదల చేయగా, అవి శ్రోతల్ని అలరిస్తున్నాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చుతున్నారు. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అని, కల్యాణిమాలిక్ పాటలు ఈ సినిమాకు ప్రధానబలమని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కళ, ఛాయాగ్రహణం: శిష్ట్లా.వి.ఎం.కె., నేపథ్యసంగీతం: ఆర్పీ పట్నాయక్.