అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్ క్యాండిడా ఆరిస్ అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నది. వాషింగ్టన్‌లో చాలా మంది ఈ వైరస్‌బారిన పడ్డారని వార్తలు వెలువడ్డాయి. కొత్త వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. దవాఖానాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నదని, శక్తివంత మైన యాంటీఫంగల్ ఔషధాల్ని సైతం వైరస్ తట్టుకుంటున్నదని వైద్యులు తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సమాచారం ప్రకారం అమెరికాలో క్యాండిడా ఆరిస్ తొలి కేసు ఈ ఏడాది జనవరి 10న నమోదైంది. వైరస్‌బారిన పడ్డవాళ్లలో ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వైరస్ సొకిందని తెలిపే ప్రత్యేక లక్షణాలేవీ బయటకు కనపడటం లేదు. క్యాండిడా ఆరిస్ వైరస్‌ను మొదటిసారి 15 ఏండ్ల క్రితం జపాన్‌లో గుర్తించారు. తాజాగా అమెరికా సహా 40 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.
